![]() |
![]() |

సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' (సూరారై పొట్రు) విడుదలై వారం రోజులైంది. ఇప్పటికీ ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆ సినిమాని ప్రశంసల్లో ముంచెత్తుతూ వస్తూనే ఉండటంతో వార్తలో సినిమాగా మారింది. ఇటీవలే దుబాయ్ విహారయాత్రను ఫ్యామిలీతో పూర్తిచేసుకొని వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ తన లేటెస్ట్ ట్వీట్‌లో ఆ సినిమాను ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్‌గా పేర్కొన్నాడు. దీనికి స్పందించిన సూర్య 'సర్కారు వారి పాట'ను చూడ్డానికి వెయిట్ చేస్తున్నానని చెప్పారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి సైతం మహేశ్‌కు థాంక్స్ చెప్పింది.
తెలుగు వెర్షన్ కాకుండా నేరుగా ఒరిజినల్ వెర్షన్‌ను 'సూరారై పొట్రు'ను చూసిన మహేశ్, “SooraraiPottru What an inspiring film!! Brilliantly directed with amazing performances... @Suriya_offl Shine on brother... Congrats to the entire team”. అని తన ట్వీట్‌లో ప్రశంసించాడు. వెంటనే సూర్య, “@urstrulyMahesh very kind of you brother! Thanks a ton! Looking forward for #SarkaruVaariPaata”. అని రిప్లై ఇచ్చాడు. సినిమాలో సూర్య భార్యగా నటించిన అపర్ణ, “Thank you so much sir”. అని ట్వీట్ చేసింది.

![]() |
![]() |