![]() |
![]() |

టాలెంటెడ్ తెలుగు హీరోల్లో శ్రీవిష్ణు ఒకడు. డిఫరెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడికి అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీవిష్ణు ఖాతాలో హిట్టు సినిమాలు ఉన్నాయి. కానీ, భారీ కమర్షియల్ హిట్లు లేవు. ఇప్పుడు ఆ లోటు తీరేలా కనపడుతోంది. ఇప్పుడు అతడు హిట్ సినిమాల నిర్మాత దిల్ రాజు కాంపౌండ్‌లోకి అడుగు పెడుతున్నాడు.
శ్రీవిష్ణు కథానాయకుడిగా దిల్ రాజు ఓ సినిమా ప్రొడ్యూస్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌లో కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసిన సతీష్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. దిల్ రాజు కాంపౌండ్ నుండి వచ్చే సినిమాల టైపు టైపులో ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్. అందులో మాంచి లవ్ ట్రాక్ కూడా ఉందట. వైజాక్ బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఉంటుందని, ఆల్రెడీ శ్రీవిష్ణు షూటింగ్ స్టార్ట్ చేసిన 'రాజ రాజ చోర' కంప్లీట్ అయినా తరవాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్.
![]() |
![]() |