![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమాలో కీలక పాత్ర కోసం ఒకప్పటి కథానాయిక, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ను సంప్రదించారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అయితే, ఆ సినిమా మహేశ్ హీరోగా నటించబోయేది కాదు. పరశురామ్ దర్శకత్వంలో ఆయన చేయనున్న 'సర్కారు వారి పాట' కోసం రేణు దేశాయ్ ను సంప్రదించలేదు. మహేశ్ నిర్మాతగా తీస్తున్న 'మేజర్' కోసం సంప్రదించారట.
అడివి శేష్ హీరోగా ముంబైపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తెలుగు, హిందీ సినిమా 'మేజర్'. సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో మహేశ్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీలక పాత్రను పోషించాల్సిందిగా రేణుదేశాయ్ ను అడిగారట. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారని 'మేజర్' చిత్రబృందం భావిస్తోందట. రేణు దేశాయ్ ఇంకా ఈ విషయం చెప్పలేదట.
ఇటీవల మళ్లీ మేకప్ వేసుకోవడానికి తాను సిద్ధమని రేణు దేశాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులోనూ రేణు కుమారుడు అకిర నందన్ కు ఇష్టమైన హీరోలలో అడివి శేష్ ఒకడు. సో.. యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
![]() |
![]() |