![]() |
![]() |

కరిష్మా కపూర్ 90లలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించారు. రాజా హిందుస్తానీ, కూలీ నంబర్ 1, దిల్ తో పాగల్ హై, ఫిజా లాంటి సినిమాలు వాటిలో కొన్ని. వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించిన ఆమె వ్యక్తిగతం అందుకు పూర్తి భిన్నం. తన వైవాహిక జీవితంలో భర్త సంజయ్ కపూర్, అత్త చేతుల్లో తాను ఎలాంటి నరకాన్ని చవిచూసిందో వివరిస్తూ లేటెస్ట్‌గా ఆమె బయటపెట్టిన విషయాలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
పెళ్లి అనేది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందనీ, ప్రతి రోజూ తాను నరకాన్ని చూశాననీ ఆమె వెల్లడించారు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో మాట్లాడిన ఆమె, హనీమూన్ సందర్భంగా ఎదుర్కొన్న ఓ చేదు జ్ఞాపకాన్ని బయటపెట్టారు. వివాహానంతరం భర్తతో హాయిగా ఎంజాయ్ చేద్దామని హనీమూన్‌కు వెళ్లిన తనను ఓ ఫ్రెండ్‌తో పడుకోవాల్సిందిగా భర్త బలవంతం చేశాడనీ, తాను నిరాకరించడంతో, తీవ్రంగా కొట్టాడనీ ఆమె చెప్పారు. అతని స్నేహితుల్లో ఒకరికి తన రేటు ఇంతంటూ చెప్పాడని కూడా ఆమె షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
సంజయ్ కపూర్‌కు కరిష్మా రెండో భార్య. ఆమెతో వివాహానంతరం కూడా మొదటి భార్యతో అతను శారరీక సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి ప్రశ్నించినప్పుడు, తన తప్పును ఒప్పుకోవడానికి బదులుగా కరిష్మాను వేధించడం ప్రారంభించాడు సంజయ్.

భర్త చేతుల్లోనే కాకుండా తన అత్త చేతుల్లోనూ అనేకసార్లు వేధింపులకు గురయ్యానని కరిష్మా తెలిపారు. ఓసారి భర్త, అత్త కలిసి తనను దారుణంగా కొట్టారని ఆమె వెల్లడించారు. తను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తన అత్త ఓ డ్రస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందనీ, అయితే ప్రెగ్నెంట్ కావడం వల్ల ఆ డ్రస్ తనకు సరిపోలేదనీ, దాంతో ఆ ఇద్దరూ కలిసి తనకు నరకాన్ని చూపించారనీ చెప్పారు కరిష్మా.
ఆ నరకానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని 2012లో నిర్ణయించుకున్న కరిష్మా, తన పిల్లలతో కలిసి విడిగా ఉండటం మొదలుపెట్టారు. అనంతరం 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి వాతావరణంలో పిల్లలను పెంచడం ఇష్టంలేకే వారి కోసం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. డైవోర్స్ తర్వాత తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేశారు కరిష్మా. ప్రస్తుతం పిల్లలతో కలిసి హాయిగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
![]() |
![]() |