![]() |
![]() |

అక్కినేని మూడో తరం కథానాయకుడు నాగచైతన్య.. ఈ మధ్య క్రీడాకారుడి పాత్రల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపించేస్తున్నాడు. నిన్నటికి నిన్న మజిలీలో క్రికెటర్ గా కనిపించి కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ ని తన కిట్టీలో వేసుకున్న ఈ టాలెంటెడ్ స్టార్.. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో హాకీ ప్లేయర్ గా దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. అంతేకాదు.. క్యారెక్టర్ లో పర్ ఫెక్షన్ కోసం హాకీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. మనం తరువాత వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో థాంక్యూ పేరుతో చైతూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కథానుసారం ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా కనిపిస్తాడట. అలాగని ఇదేదో స్పోర్ట్స్ చుట్టూ తిరిగే సినిమా కాదని అంటున్నారు. మొత్తమ్మీద.. స్పోర్ట్స్ పర్సన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఈ అక్కినేని యంగ్ హీరో మారుతుండడం విశేషం.
మరి.. హాకీ ప్లేయర్ గా చైతూ ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలంటే 2021 ద్వితీయార్ధం వరకు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |