![]() |
![]() |

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మిర్చిలాంటి కుర్రాడు, రామ్ లీల వంటి చిత్రాల్లో నటించినా రాని గుర్తింపుని.. బిగ్ బాస్ సీజన్ 4తో పొందాడు యంగ్ టాలెంటెడ్ అభిజిత్. ఈ సీజన్ లో విజేతగా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పరిశ్రమ వర్గాల నుంచి కూడా ఆదరణ పొందుతున్నాడు. ఈ క్రమంలోనే.. అభిజిత్ కి ఓ మల్టిస్టారర్ మూవీలో ఓ స్పెషల్ రోల్ ప్లే చేసే ఛాన్స్ దక్కిందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ఎఫ్ 3. 2019 నాటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2కి ఇది సీక్వెల్ వెర్షన్. కాగా, ఎఫ్ 2లో బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ నూతన్ నాయుడుని నటింపజేసిన అనిల్.. ఎఫ్ 3లో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ ని ఎంపిక చేశాడని టాక్. అంతేకాదు.. చాలా స్పెషల్ గా అభిజిత్ రోల్ ఉంటుందని టాక్. త్వరలోనే ఎఫ్ 3లో అభిజిత్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మరి.. రాబోయే కాలంలో మరెన్ని అవకాశాలు ఈ హ్యాండ్సమ్ హీరో ని వరిస్తాయో చూడాలి.
![]() |
![]() |