![]() |
![]() |

లెజెండరీ ఒడియా మ్యూజిక్ డైరెక్టర్ శంతను మొహాపాత్ర కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత జబ్బులతో బాధపడుతూ వచ్చిన మొహాపాత్ర చివరకు న్యుమోనియాతో ఇబ్బందిపడుతూ మంగళవారం రాత్రి గుండె పట్టేయడంతో మృతి చెందారు. పలాసపల్లిలోని ఆయన నివాసం వద్ద ఈ మ్యూజిక్ మేస్ట్రోకు వందలాది మంది నివాళులర్పించారు.
ఒడిశా గవర్నర్ గణేషీ లాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బి.బి. హరిచందన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర పధాన్ సహా పలువురు ప్రముఖులు మొహాపాత్ర మృతికి సంతాపం తెలియజేశారు. ఆరు దశబ్దాల పాటు ఒడిశా సంగీతంలో మొహాపాత్ర ఓ భాగమనీ, ఆయన చిరస్మరణీయులనీ తన సంతాప సందేశంలో గణేషీ లాల్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శంతను అంత్యక్రియలు జరుపుతామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
కేవలం ఒడియాలోనే కాకుండా పలు భాషల్లో మొహాపాత్ర పనిచేశారు. తొలి ఆధునిక ఒడియా బాలేగా కీర్తి పొందిన 'కోణార్క్ గాథ'కు ఆయన బాణీలు సమకూర్చారు. ఆ బాలేకి గురుకృష్ణ గోస్వామి సాహిత్యం అందించగా, అక్షయ్ మొహంతీ గానం చేశారు. లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, మన్నా డే, ఉషా మంగేష్కర్, సురేశ్ వాడేకర్, అనూరాధ పౌడ్వాల్, ఉషా ఉథప్, కవితా కృష్ణమూర్తి లాంటి గొప్ప హిందీ గాయనీ గాయకులతో పనిచేసిన ఏకైక ఒడియా మ్యూజిక్ డైరెక్టర్ మొహాపాత్ర.
![]() |
![]() |