![]() |
![]() |

లవ్ బర్డ్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా బుధవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కళ్లకు చిక్కారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం సిటీని దాటుతున్నారు. వాళ్లు ఎక్కడకు వెళ్తున్నారో తెలుసా.. మాల్దీవ్స్‌కు! అవును. ఆ ఇద్దరూ మాల్దీవులకు టిక్కెట్స్ బుక్ చేసుకొని, బుధవారం బయలుదేరి వెళ్లారు. వైట్ టాప్, టై-డై ప్యాంట్స్‌లో కియారా స్టైలిష్‌గా కనిపించగా, ఆరంజ్ ట్రాక్‌పాంట్స్, గన్‌మెటల్ జాకెట్ ధరించి క్యాజువల్ లుక్‌లో ఉన్నాడు సిద్ధార్థ్.
ఆసక్తికరమైన విషయమేమంటే, గత ఏడాది సైతం ఇదే టైమ్‌కు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆ ఇద్దరూ ఆఫ్రికా టూర్‌కు వెళ్లారు. అయితే తామిద్దరూ జంటగా కలిసున్న పిక్చర్స్‌ను వాళ్లు షేర్ చెయ్యలేదు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఊరుకోలేదు. ఆ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అవి వైరల్ అయ్యాయి.

తరచూ కలిసి కనిపిస్తున్నా, ఆ ఇద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను బాహాటంగా ప్రకటించలేదు. కానీ వారి సన్నిహిత వర్గాలు మాత్రం కియారా, సిద్ధార్థ్ ప్రేమలో మునిగితేలుతున్నారని చెబుతున్నారు. 'షేర్‌షా' మూవీలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఇద్దరూ లవ్‌లో పడ్డారు. సెట్స్ మీద ఆ ఇద్దరి వ్యవహారం చూసిన యూనిట్ మెంబర్స్ నుంచి ఈ విషయం లీక్ అయ్యింది.
ఇప్పుడు ఆ ఇద్దరూ మాల్దీవులకు చెక్కేయడం, ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించడంతో వారు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయం మరోసారి బహిర్గతమైంది. కియారా టాలీవుడ్‌కు మహేశ్ సరసన చేసిన 'భరత్ అనే నేను' మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్ జోడీగా 'వినయ విధేయ రామ'లో నటించింది.

![]() |
![]() |