![]() |
![]() |

డార్లింగ్ (2010) తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రాధేశ్యామ్. బుట్టబొమ్మ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ పిరియడ్ లవ్ సాగాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ, జయరామ్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ బాణీలు సమకూర్చుతున్నారు.
ఇదిలా ఉంటే.. రాధేశ్యామ్ ని 2021 వేసవిలో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 30 (శుక్రవారం)ని రిలీజ్ డేట్ గా లాక్ చేసినట్లు బజ్. త్వరలోనే విడుదల తేదిపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరి.. ప్రభాస్ గత చిత్రం సాహో తెలుగునాట ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. రాధేశ్యామ్ అయినా ఆ ముచ్చటని తీరుస్తుందేమో చూడాలి.
![]() |
![]() |