![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్, కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ నేర్కొండ పార్ వై ఆధారంగా రూపొందుతున్న ఈ కోర్ట్ డ్రామా కోసం తొలిసారిగా లాయర్ పాత్రలో దర్శనమివ్వనున్నారు ఈ కొణిదెల స్టార్. అంతేకాదు.. మంగళవారంతో తన షూటింగ్ పార్ట్ ని కూడా సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉంటే.. వకీల్ సాబ్ కి సంబంధించిన టీజర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేసిందట. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆల్ క్లాస్ ఆడియన్స్ అటెన్షన్ పొందేలా ఈ టీజర్ ప్యాక్డ్ గా ఉంటుందని బజ్. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ లో పవన్ కి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య ఇతర కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. 2021 వేసవి ఆరంభంలో వకీల్ సాబ్ వెండితెరపై వెలుగులు పంచనున్నాడు.
![]() |
![]() |