![]() |
![]() |

భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లిన చందమామ కాజల్ అగర్వాల్ అక్కడి నుంచి వరుస అప్‌డేట్స్‌తో, పిక్చర్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆమె కొన్ని కొత్త ఫొటోలను షేర్ చేశారు. గత వారం ఆమె బిజినెస్‌మ్యాన్ గౌతమ్‌ను ముంబైలో తాజ్ ప్యాలెస్ హోటల్‌లో వివాహమాడారు. తమ పెళ్లి వేడుకతో పాటు పసుపు కుంకుమ, గోరింటాకు వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆ జంట పంచుకున్నారు.
మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా నాలుగు కొత్త ఫొటోలను కాజల్ షేర్ చేశారు. రెండు ఫొటోల్లో హోటల్ నుంచి నీలి సముద్రాన్నీ, నీలాకాశాన్నీ చూస్తున్న కాజల్ కనిపిస్తుంటే, ఇంకో ఫొటోలో హజ్బెండ్‌ను కావలించుకుని కనిపిస్తున్నారు కాజల్. మరో ఫొటోలో ఆమె ఓ టేబుల్ దగ్గర కూర్చొని కెమెరాకు పోజిచ్చారు. ఎప్పటిలా ఆ ఫొటోల్లో ఆమె గార్జియస్‌గా కనిపిస్తున్నారు.
హనీమూన్‌కు బయలుదేరే ముందు కాజల్ తమ పాస్‌పోర్ట్‌లను షేర్ చేశారు. వాటిపై 'గౌతమ్ కిచ్లు', 'కాజల్ కిచ్లు' అని ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో తన పేరును మార్చుకోకపోయినా, 'మిసెస్ కిచ్లు'గా పిలిపించుకోవడానికి ఇష్టపడతానని ఆమె చెప్పారు.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
![]() |
![]() |