![]() |
![]() |

సంజయ్ దత్ భార్య మాన్యతా దత్‌కూ, ఆమె సవతి కుమార్తె త్రిశాలా దత్‌కూ మధ్య అందమైన అనుబంధం ఉందనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు ప్రేమను, అభిమానాన్ని ప్రదర్శించే ఏ చిన్న అవకాశాన్నీ వారు వదులుకోరు. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకొనే విషయాలు, పిక్చర్ల ద్వారా కూడా వారు పరస్పరం తమ ప్రేమను ప్రకటిస్తూ ఉంటారు. ఆ ఇద్దరినీ చూస్తుంటే సాధారణంగా కనిపించే సవతి తల్లీకూతుళ్లులాగా అనిపించరనేది నిజం. వాళ్లు చక్కని స్నేహితుల్లాగా కనిపిస్తుంటారు. త్రిశాల ఎవరో కాదు.. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కుమార్తె. బ్రెయిన్ ట్యూమర్‌తో రిచా 1996లో మృతి చెందారు.
కేన్సర్‌ను జయించానంటూ సంజయ్ దత్ ప్రకటించాక, ధైర్యంగా ఉండటం గురించి సోషల్ మీడియాలో మాన్యత ఓ నోట్‌ను షేర్ చేశారు. "కొన్నిసార్లు మీరు మీ జీవితంతో ధైర్యంగా వ్యవహరించాలి.. కాబట్టి ఎదుటివాళ్లు వాళ్లతో ధైర్యంగా ఉండగలుగుతారు.. తల ఎత్తుకొనే ఉండండి.. మీ హృదయం దృఢంగా ఉంటుంది." అని అందులో ఆమె రాసుకొచ్చారు. దానికి "వావ్" అని కామెంట్ చేసిన త్రిశాలా బ్లూ కలర్ హార్ట్ ఎమోటికాన్స్‌ను జోడించింది. ఎందుకంటే తన పోస్ట్‌లో మాన్యత అదే కలర్ డ్రస్ ధరించింది కాబట్టి.

కొద్ది రోజుల క్రితం త్రిశాల తన క్యాండిట్ పిక్చర్‌ను ఒకదాన్ని పోస్ట్ చేసింది. అందులో బ్లూ స్వెటర్, డెనిమ్ ప్యాంట్ ధరించి ఉంది. తను ఇంట్లో ఎక్కడ ఉండి ఆ పిక్చర్‌ను తీయించుకుందో వెల్లడిస్తూ, "2020లో నేనెక్కువగా గడుపుతున్న చోటిదే.. తెలుసుకుంటే మీరు వండర్ అవుతారు.. కిచెన్‌లో.." అని దానికి క్యాప్షన్ పెట్టింది. ఆ పోస్ట్ చూసిన ఆమె స్టెప్-మదర్ మాన్యతా దత్ స్పందించింది. "బ్యూటిఫుల్" అనే కామెంట్ పెట్టి హార్ట్ ఎమెటికాన్స్‌ను జోడించింది. అలా ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను ప్రదర్శించుకుంటూ వస్తున్నారు.

![]() |
![]() |