![]() |
![]() |

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటి లక్ష్మి మంచుకి సమంత స్పెషల్ గా డ్రెస్సులు పంపించారు. ఎందుకో తెలుసా? కొన్ని రోజుల క్రితం సమంత ఓ క్లాతింగ్ బ్రాండ్ 'సాకీ' స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ బ్రాండ్ మీద డిజైన్ చేసిన కొత్త డ్రస్సులు ఎలా ఉన్నాయో ట్రై చేయమని వాళ్ళిద్దరికీ పంపించారు.
సమంత, రకుల్, లక్ష్మీ మంచి మంచి స్నేహితులు. అందుకని ముందు సాకీ బ్రాండ్ డ్రెస్సులు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాయి అన్నమాట. సమంత పంపిన సాకీ జాకెట్ ను 'చిట్టి చిలకమ్మా' షూటింగ్ కోసం లక్ష్మీ మంచు వేసుకున్నారు కూడా! రకుల్ ఇంకా డ్రెస్ ట్రై చేయలేదు. కానీ, సమంత పంపినట్టు ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పేర్కొన్నారు. స్నేహితురాలి బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నారు.


![]() |
![]() |