![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఊర మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో కథానాయిక ఎంపిక పూర్తయింది. ఇందులో బాలయ్య సరసన తమిళ కథానాయకుడు ఆర్య సతీమణి సాయేషా సైగల్ నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ మంగళవారం అధికారికంగా తెలియజేసింది. త్వరలో ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని పేర్కొంది.
సాయేషాకు తెలుగులో రెండో చిత్రమిది. అఖిల్ అక్కినేని హీరోగా పరిచయమైన 'అఖిల్' చిత్రంతో ఆమె కూడా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత తమిళంలోనే ఎక్కువగా చేశారు. కొన్ని అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సూర్య సరసన నటించిన 'బందోబస్త్' చిత్రం ద్వారా గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా పునీత్ రాజ్‌కుమార్‌తో కన్నడ చిత్రం 'యువరత్న' పూర్తి చేశారు.

సాయేషా సైగల్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకులలో మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. 'జయ జానకి నాయక' తర్వాత బోయపాటి దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది.

![]() |
![]() |