![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ విక్రమ్ ఇంటి నుంచి శుభవార్త! ఆయన తాతయ్య అయ్యారు!! అవును. విక్రమ్ కుమార్తె అక్షిత సోమవారం ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆమె పాపను ప్రసవించింది. ఈ విషయం తెలియగానే విక్రమ్ కుటుంబం చిన్న వేడుకను జరుపుకున్నట్లు సమాచారం.
అక్షిత తన దీర్ఘకాల స్నేహితుడు మను రంజిత్‌ను 2017లో పెళ్లాడింది. రంజిత్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అధినేత సి.కె. రంగనాథన్ కుమారుడు. వారి పెళ్లి గోపాలపురంలోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఇంట్లో జరిగింది. ఎందుకంటే.. కరుణానిధికి రంజిత్ మునిమనవడు. అప్పట్లో కరుణానిధి ఆశీస్సులు తీసుకుంటున్న ఆ జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారి రిసెప్షన్‌కు కోలీవుడ్ ప్రముఖులంతా వచ్చారు. ఇప్పుడు చూస్తే.. ఇంకా కుర్రాడిలానే కనిపిస్తున్న విక్రమ్ తాతయ్యారు.. నమ్మడానికి కొంచెం కష్టమైనా ఇది నిజం.
మరోవైపు విక్రమ్ తనయుడు ధ్రువ్ ఇటీవల 'ఆదిత్య వర్మ' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన సూపర్ హిట్ మూవీ 'అర్జున్ రెడ్డి'కి అది తమిళ రీమేక్.
![]() |
![]() |