![]() |
![]() |

బాలకృష్ణ సరసన 'వీరభద్ర'లో నాయికగా నటించిన తనుశ్రీ దత్తా 2018లో నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. మీ టూ ఉద్యమంలో భాగంగా ఆమె చేసిన ఈ ఆరోపణలను నానా పటేకర్ ఖండించినప్పటికీ, తనుశ్రీ తన మాటపై కట్టుబడి ఉన్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తిరిగి నటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. బిగ్ బడ్జెట్ సౌత్ ప్రాజెక్టులలో తనను తీసుకొనే నిమిత్తం ముగ్గురు బిగ్ సౌత్ ఫిల్మ్ మేనేజర్స్‌తో, అలాగే ముంబైలోని 12 క్యాస్టింగ్ ఆఫీస్లతో టచ్‌లో ఉన్నానని ఆమె తెలిపారు. యు.ఎస్.లోని ఐటీ జాబ్ చేయడానికి బదులు సినిమాల్లోకి తిరిగి రావాలని నిశ్చయించుకున్నట్లు కూడా తనుశ్రీ వెల్లడించారు.
2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా సెట్స్‌పై నానా పటేకర్ తనను హెరాస్ చేశారని 2018లో ఆమె ఆరోపించారు. ఒక పాట చిత్రీకరించే సమయంలో నానా తనను అభ్యంతరకర రీతిలో స్పృశించారని, ఆ పాటలో వల్గర్‌గా, ఇబ్బందికరంగా ఉన్న స్టెప్స్ వేయడానికి తాను చాలా అసౌకర్యంగా ఫీలయ్యాననీ ఆమె చెప్పారు. ఆ తర్వాత ఆమె నటనకు వీడ్కోలు పలికి, యుఎస్ వెళ్లిపోయారు. తన పోస్ట్‌లో, "ఇండస్ట్రీలోని పవర్ఫుల్ వ్యక్తులు కొంతమంది సైలెంట్‌గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లకు నిజం తెలుసు. పైగా వాళ్లు నా శ్రేయోభిలాషులు" అని ఆమె పేర్కొనడం గమనార్హం. 2004లో ఆమె మిస్ ఇండియాగా ఎన్నికైన విషయం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.

![]() |
![]() |