![]() |
![]() |

'కాటమరాయుడు' తరువాత మూడేళ్ళ గ్యాప్ తీసుకుని మరీ టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తున్నారు శ్రుతి హాసన్. 'క్రాక్', 'వకీల్ సాబ్'.. ఇలా తక్కువ గ్యాప్ లోనే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో డబుల్ ధమాకా ఇచ్చేందుకు ఈ చెన్నై చంద్రం సిద్ధమయ్యారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలకు సంబంధించి అటు కథానాయకులతోనూ, ఇటు దర్శకులతోనూ శ్రుతి రిపీట్ మంత్రం పఠిస్తున్నారు. 'క్రాక్' విషయానికి వస్తే ఈ సినిమా కథానాయకుడు రవితేజతోనూ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లోనూ ఇప్పటికే 'బలుపు' చిత్రం చేశారు శ్రుతి. ఇక 'వకీల్ సాబ్' విషయానికి వస్తే ఆ చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో అంతకుముందు 'గబ్బర్ సింగ్', 'కాటమరాయుడు' చేశారు మిస్ హాసన్. అలాగే ఆ మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డెబ్యూ ఫిల్మ్ 'ఓ మై ఫ్రెండ్'లో శ్రుతిదే లీడ్ రోల్.
మరి.. రీ-ఎంట్రీలో రిపీట్ మంత్రం పఠిస్తున్న శ్రుతి హాసన్ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |