![]() |
![]() |

లోకనాయకుడు కమల్ హాసన్, టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'విక్రమ్'. కమల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆ ఆసక్తికి తగ్గట్టే.. ఈ మూవీ త్వరితగతిన చిత్రీకరణ పూర్తిచేసుకుని వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.
కోలీవుడ్ కథనాల ప్రకారం.. లోకేష్ గత చిత్రాలు 'మానగరం' (సందీప్ కిషన్, రెజీనా), 'ఖైదీ' (కార్తి) ఎలాగైతే రాత్రివేళలోనే చిత్రీకరణ జరుపుకున్నాయో.. అదే విధంగా 'విక్రమ్' కూడా సబ్జెక్ట్ రీత్యా నైట్ షూట్స్ లోనే పిక్చరైజ్ కానుందట. మానగరం, ఖైదీ, విక్రమ్.. వేటికవే విభిన్న కథాచిత్రాలైనప్పటికీ మూడింటికి ఒకే సెంటిమెంట్ ని లోకేష్ ఫాలో అవుతుండడం విశేషం.
కాగా, లోకేష్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం మాస్టర్ మాత్రం అందుకు విభిన్నంగా తెరకెక్కింది. ఇందులో కూడా కొన్ని నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉన్నప్పటికీ.. ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అని టీజర్ ని బట్టి స్పష్టమవుతోంది.
![]() |
![]() |