![]() |
![]() |

దీపావళి పర్వదినం రోజు ఎలాంటి దుస్తులు ధరించాలనేది మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన డెసిషన్స్‌లో ఒకటి. ఏడాదిలో వచ్చే తెలుగువారి అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి కాబట్టి ఈ పండుగకు మనం ఎంత ఉత్సాహంగా, ఆనందంగా ఉన్నామో మనం ధరించే దుస్తులు కూడా చెబుతుంటాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే విషయమే తీసుకుంటూ ప్రతి పండుగకూ ఆమె కనిపించే తీరు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది. శనివారం ఉదయం నుంచే ఈసారి పూజ ఎలాంటి లుక్‌లో కనిపిస్తుందోనని ఆమె ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తూ వచ్చారు. ఎప్పటిలా ఆమె వారిని డిజప్పాయింట్ చేయలేదు. ఫ్యామిలీతో కలిసి దీపావళి పండగను నిరాడంబరంగా జరుపుకున్నప్పటికీ నలుగురు కుటుంబసభ్యులు బట్టల విషయంలో పాటించిన కలర్ కో-ఆర్డినేషన్‌ను అభినందించకుండా ఉండలేం.
శనివారం రాత్రి తల్లిదండ్రులు లత, మంజునాథ్, తమ్ముడు రిషభ్‌తో కలిసి దిగిన పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పూజా హెగ్డే షేర్ చేయగానే ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. నలుగురూ తమ లుక్స్‌తో అంతగా ఆకట్టుకున్నారు మరి. కొట్టొచ్చినట్లు కనిపించిన విషయంలో నలుగురూ లేత ఆకుపచ్చ దుస్తుల్లో అదరగొట్టారు. అమ్మానాన్నలు సోఫాలో కూర్చుంటే, పూజ సోఫా హ్యాండ్‌రెస్ట్‌పై కూర్చుంది. రిషభ్ వాళ్ల వెనుక ఆనుకొని నిల్చున్నాడు. దీపావళి ఫ్యామిలీ ఫెస్టివల్ అనడానికి నిదర్శనంగా ఆ పిక్చర్ కనిపిస్తోంది. "Happy Diwali from The Hegde’s. May your lives be filled with love, light, positivity and happiness. May the light brighten up your homes." అంటూ దానికి క్యాప్షన్ పెట్టింది పూజ.
.jpg)
ఆ ఫ్యామిలీ పిక్చర్‌తో పాటు ఒక పళ్లెంలో దీపం పెట్టి, దాని చుట్టూ పూలతో అలంకరిస్తున్న తన సోలో పిక్చర్‌ను కూడా ఆమె షేర్ చేసింది. దానికి "Decoration duty made me happy. Happy Diwali" అంటూ క్యాప్షన్ పెట్టింది పూజ.
.jpg)
![]() |
![]() |