![]() |
![]() |

తెలుగువాళ్లు ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. ఉదయం రకరకాల పిండివంటలతో భోజనం చేసి, పిల్లాపాపలతో కలిసి సాయంత్రం దాకా బోలెడన్ని కబుర్లు చెప్పుకొని, చీకటి పడ్డాక చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బాణాసంచా కాల్చడం దీపావళికి మనం చేసుకున్న అలవాటు. ఈసారి కరోనా మహమ్మారి కారణంగా ఆ వైరస్ బారిన పడినవారికి అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో టపాసులు కాల్చవద్దని ప్రభుత్వం ప్రజల్ని కోరింది. అయినప్పటికీ చాలా మంది జనం చెప్పుకోదగ్గ స్థాయిలోనే టపాసులు కాల్చారు. సినీ సెలబ్రిటీలు టపాసులు కాల్చకపోయినా, పిల్లల చేత పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించని కాకరపువ్వొత్తులను కాల్పింపచేసి, ఆనందపడ్డారు. అలాంటి సెలబ్రిటీల్లో అల్లు అర్జున్ కూడా ఉన్నారు.
శనివారం దీపావళి సందర్భంగా కూతురు అర్హతో కాకరపువ్వొత్తును కాల్పిస్తున్న ఓ క్యూట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌ను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అందులో క్రాకర్‌ను కాలుస్తూ భయంతో తలపక్కకు తిప్పుకుంటున్న అర్హ కనిపిస్తుంటే, మోకాళ్లమీద కూర్చొని భయపడవద్దని బన్నీ కూతురికి నవ్వుతూ అభయం ఇస్తున్నాడు. ఈ పిక్చరతో పాటు "Happy Diwali. May this Diwali bring light and prosperity into lives." అంటూ క్యాప్షన్ రాశాడు బన్నీ. ఈ పోస్ట్‌కు 17 గంటల్లోగా 1 మిలియన్ పైగా లైక్స్ రావడం ఒక విశేషం.
![]() |
![]() |