![]() |
![]() |

నవంబర్ నెలకి, లేడీ సూపర్ స్టార్ నయనతారకి మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. నవంబర్ 18.. నయనతార పుట్టినరోజు. అంతేకాదు.. తన కెరీర్ లో దేవత పాత్రల్లో నటించిన సినిమాలు కూడా వేర్వేరు సంవత్సరాల్లో ఈ నెలలోనే విడుదలై.. నటిగా ఆమెకు మంచి పేరుని తీసుకువస్తున్నాయి. 2011లో ఇదే నవంబర్ లో సీతాదేవిగా నయన్ నటించిన 'శ్రీరామరాజ్యం' జనం ముందుకు వచ్చింది. ఇదివరకు ఎన్నడూ కనిపించని పాత్రలో కనిపించి.. జననీరాజనాలు అందుకున్నారామె.
కట్ చేస్తే.. తొమ్మిదేళ్ళ తరువాత మళ్ళీ ఈ సంవత్సరం 'అమ్మోరు తల్లి'గా దర్శనమిచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దీపావళి కానుకగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాలో నయన్ ముక్కుపుడక అమ్మవారుగా నటించారు. ఇందులో ఆమె ఆహార్యం, అభినయంకి మంచి మార్కులు పడుతున్నాయి. మొత్తమ్మీద.. నవంబర్ నెల నయన్ కి దేవత పాత్రల పరంగా ప్రత్యేకమనే చెప్పాలి.
![]() |
![]() |