![]() |
![]() |

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న 'లవ్ స్టోరి' ఇటీవలి కాలంలో జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఈ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి కోసం మనం అంతా ఎదురుచూస్తుంటే, మేకర్స్ దీపావళి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చూడగానే ఆ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్‌లో ఒక కల్యాణ మండపంలో పెళ్లి దుస్తుల్లో కూర్చుని కనిపిస్తున్నారు హీరో హీరోయిన్లు. నవ్వు ముఖాలతో ఒకరినొకరు చూసుకుంటున్న వారి కళ్లే మాట్లాడుతున్నట్లున్నాయి.
ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన శేఖర్ కమ్ముల "Team LOVESTORY wishes you and your family a very HAPPY DIWALI" అని ట్వీట్ చేశారు.
'లవ్ స్టోరి' విషయానికి వస్తే, 'ఫిదా' తర్వాత శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కలిసి పనిచేస్తున్న రెండో సినిమా ఇది. ఎప్పుడో వేసవిలో ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మాణమవుతోంది.
ఇదివరకు నాగచైతన్య భార్య, టాప్ యాక్ట్రెస్ సమంత ఎడిట్ చేయని 'లవ్ స్టోరి' 80 శాతం ఫుటేజ్‌ను చూసి, సినిమాలో సాయిపల్లవి డామినేషన్ కనిపిస్తోందని కామెంట్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. కొంతమంది అది సాయిపల్లవికి సమంత ఇచ్చిన కామెంట్‌గా భావిస్తే, చైతూ ఫ్యాన్స్ మాత్రం దాన్ని నెగటివ్‌గా తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వారి స్పందనను బట్టి అర్థమైంది. అయితే ఈ ప్రచారాన్ని సమంత ఖండించారనీ, తానసలు ఆ సినిమా ఫుటేజ్‌ను చూడటం కానీ, దానిపై కామెంట్ చేయడం కానీ చేయలేదనీ తెలిపినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట.
![]() |
![]() |