![]() |
![]() |

ఒక హిట్టయిన సినిమాకు సీక్వెల్స్ తీయడం వేరు. ఒక కథనే రెండు అంతకంటే ఎక్కువ భాగాలు తియ్యడం వేరు. ఒకే కథతో 'బాహుబలి'ని రెండు భాగాలుగా రూపొందించి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అలా 'బాహుబలిః ద బిగినింగ్', 'బాహుబలిః ద కన్‌క్లూజన్' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఆ బాటలో ఎన్టీఆర్ బయోపిక్‌ను క్రిష్ రెండు భాగాలుగా తీశారు. ఇప్పుడు హిందీలో 'బ్రహ్మాస్త్ర' కూడా ఇదే తరహాలో తయారవుతోంది. అదే బాటలో ఇప్పుడు మణిరత్నం కూడా ప్రయాణించేందుకు సంకల్పించారు.
అవును. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే పీరియడ్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జయం రవి మెయిన్ లీడ్‌గా చేస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యా రాయ్, కార్తీ, విక్రమ్, కీర్తి సురేశ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీని ఒకే సినిమాగా కాకుండా రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మణిరత్నం వెల్లడించారు. మంగళవారం తన భార్య సుహాసిని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అభిమానులతో ఆయన లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు "అవును, 'పొన్నియన్ సెల్వన్'ను రెండు భాగాలుగా తీస్తున్నాను" అని చెప్పారు. అయితే ఒకటి విడుదల అయిన తర్వాత రెండో భాగాన్ని తియ్యడం కాకుండా, రెండు భాగాలనూ ఒకేసారి తీసి, ఒకదాని తర్వాత ఒకదాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
![]() |
![]() |