![]() |
![]() |

టాలీవుడ్‌లో మహేశ్ సరసన చేసిన 'భరత్ అనే నేను' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండో తెలుగు సినిమా 'వినయ విధేయ రామ' ఫ్లాపయింది. అయితే 'కబీర్ సింగ్', 'గుడ్ న్యూస్' సినిమాల హిట్లతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర బలంగా వేసింది. భవిష్యత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఇప్పటికే అక్కడ పేరు తెచ్చుకుంది. ఆమెకు ఆఫర్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆమె మరో తెలుగు సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రామ్‌చరణ్ జోడీగా ఒక సినిమాలో నటించేందుకు ఆమె సంతకం చేసిందనే ప్రచారం ప్రస్తుతం బాలీవుడ్‌లో జోరుగా నడుస్తోంది. ఇంతకుముందు ఇప్పట్లో సౌత్ సినిమాల్లో కియారా నటించదనే వదంతులు వినిపించాయి. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అవి ఆధారంలేని వదంతులుగా ఆమె తేల్చేసింది. "నేను ఏ తెలుగు మూవీని రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే బాలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాను. ఉన్న ఇబ్బందల్లా డేట్స్ సర్దుబాటు చేయడమే. ఏదేమైనా త్వరలో టాలీవుడ్‌లో ఓ సినిమాకు సంతకం చేయబోతున్నా" అని చెప్పింది కియారా.
ఆ సినిమా ఎవరి సినిమా అనేది ఆమె చెప్పకపోయినప్పటికీ, అది చిరంజీవి సినిమా 'ఆచార్య'లో రామ్‌చరణ్ జోడీగా అనే ప్రచారం బాగా నడుస్తోంది. 'వినయ విధేయ రామ' మూవీ చేసే టైమ్‌లో చరణ్ ఫ్యామిలీ మొత్తానికి కియారా మంచి ఫ్రెండ్ అయ్యింది. ఆ ఫ్రెండ్‌షిప్‌తోటే ఆమె చరణ్‌తో నటించనున్నదని తెలుస్తోంది.
![]() |
![]() |