![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur kaaram). హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
'గుంటూరు కారం' మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ పాటు.. సినిమాలో మాస్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయట. మూవీలో పలు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు అదిరిపోతుందని వినికిడి. మొత్తానికి సెన్సార్ టాక్ ని బట్టి చూస్తే.. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర 'గుంటూరు కారం' వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమనిపిస్తోంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi) హీరోయిన్లు. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగనుంది. అదే రోజున ట్రైలర్ విడుదల చేయనున్నారు.
![]() |
![]() |