![]() |
![]() |

'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోతోంది. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. 'బేబీ'తో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు, వైష్ణవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ దృష్టి ఆమెపై పడింది. వరుస అవకాశాలు ఆమెకు లభిస్తున్నాయి. 'బేబీ'(Baby) హీరో ఆనంద్ దేవరకొండతో కలిసి మరో సినిమా చేస్తోంది. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ లో ఆశిష్ రెడ్డి సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'SVCC 37' వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు(జనవరి 4) అధికారికంగా ప్రకటించిన మేకర్స్.. ఈ సినిమా నుంచి ఆమె లుక్ ని కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో వైష్ణవి ముస్లిం యువతిగా కనిపిస్తోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఆమె పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తోందని అర్థమవుతోంది.
![]() |
![]() |