![]() |
![]() |

ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నప్పటికీ తగ్గేదేలే అంటోంది 'హనుమాన్' (Hanuman) చిత్రం. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సూపర్ హీరో ఫిల్మ్ జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఒకరోజు ముందుగానే థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.
సంక్రాంతి బరిలో మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్ (Venkatesh), రవితేజ (Raviteja), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్ల సినిమాలు ఉన్నప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా 'హనుమాన్'ని రిలీజ్ చేస్తున్నారంటే.. ఆ సినిమా పట్ల మేకర్స్ ఎంత నమ్మకంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మేకర్స్ తీసుకున్న మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హనుమాన్ కు పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. జనవరి 11న సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని భావిస్తున్నారట. అసలే స్టార్ హీరోల సినిమాలతో పోటీ, దానికితోడు పెయిడ్ ప్రీమియర్లకు సిద్ధమవ్వడం చూస్తుంటే.. 'హనుమాన్' పట్ల మేకర్స్ ప్రేక్షకులు అనుకుంటున్న దానికంటే ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతోంది.
![]() |
![]() |