![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) సినిమా విడుదల అయిందంటే చాలు తెలుగునాట పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇతర దేశాల్లో కూడా ఆ ఎట్మాస్ఫియర్ పక్కాగా కళ్ళకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది.ఎందుకంటే మహేష్ సినిమాలకి యు ఎస్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ విషయం చాలా సార్లు రుజువ్వడంతో పాటుగా ఆ ఏరియాలో మహేష్ పేరు మీద చాలా రికార్డులు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు యుఎస్ కాకుండా వేరే దేశంలో మహేష్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ సంచలనం సృష్టిస్తుంది.
గుంటూరు కారం ( guntur kaaram) ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. వేరే దేశాల్లో మాత్రం 11 నే విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఆయా కంట్రీస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసారు. అలా ఓపెన్ చేసారో లేదో హాట్ కేకుల్లా గుంటూరు కారం టికెట్స్ అమ్ముడుపోయాయి. మరి ముఖ్యంగా యునైటెడ్ కింగ్ డమ్ ( uk) కి చెందిన ఒడియన్ చైన్ ఆఫ్ థియేటర్స్ లో అయితే గుంటూరు కారం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని జరుపుకుంది. దీంతో మహేష్ సినిమా యు ఎస్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని జరుపుకోవడం కామనే కానీ ఇప్పుడు యుఎస్ ని మించి యుకే లో జరుపుకోవడం పట్ల రోజు రోజుకి పెరుగుతున్న మహేష్ క్రేజ్ కి అదొక ఉదాహరణగా ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.

మహేష్ అండ్ త్రివిక్రమ్ ల నుంచి సంవత్సరం తర్వాత సినిమా వస్తుండంతో అందరిలోను గుంటూరు కారం మీద భారీ అంచనాలే ఉన్నాయి. థమన్ (Thaman) మ్యూజిక్ లో ఇప్పటి వరకు వచ్చిన పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. మరి కొన్ని రోజుల్లో జరగబోయే ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో వరల్డ్ మొత్తం గుంటూరు కారం మానియాతో ఊగిపోవడం ఖాయం.
![]() |
![]() |