![]() |
![]() |

2009 లో మలయాళంలో వచ్చిన నీలతామర అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నటి అమలాపాల్.(amala paul) ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాల,కన్నడ భాషలకి చెందిన సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. కొన్ని సంవత్సరాల క్రితం నగ్నంగా ఒక మూవీలో కూడా నటించి సంచలనం సృష్టించిన అమలాపాల్ తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఒక వార్త తో హాట్ టాపిక్ గా నిలిచింది.
అమలాపాల్ గత ఏడాది నవంబర్ లో జగత్ దేశాయ్( jagat desai) అనే వ్యక్తిని పెళ్లాడింది. అంటే రెండు నెలల క్రితం అమలాపాల్ పెళ్లి జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తను తల్లి కాబోతున్నాని ఇద్దరం ముగ్గురుగా మారబోతున్నామని వెల్లడి చేసింది. కొంత మంది సెలబ్రిటీలు పెళ్ళికి ముందే పిల్లలని కంటున్నారు కానీ అమలా పాల్ పెళ్లి చేసుకొని కంటుందని అంటున్నారు. పెళ్లికి ముందే అమలాపాల్, జగత్ దేశాయ్ లు డేటింగ్ లో ఉన్నారు.

అమలా పాల్ గతంలో ప్రముఖ దర్శకుడు విజయ్( vijay)ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడిపోయింది. మళ్ళీ ఒక వ్యక్తి ప్రేమలో పడ్డానని చెప్పి ఆ తర్వాత అతను చీటింగ్ చేసాడని పోలీసులకి పట్టించి చివరికి జగత్ తో సెటిల్ అయ్యింది. రామ్ చరణ్ ( ram charan)తో నాయక్ ,అల్లు అర్జున్( allu arjun)తో ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాల్లో నటించిన అమలాపాల్ స్వస్థలం కేరళ(kerala)లోని అలువా
![]() |
![]() |