![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ (venakatesh) వన్ మాన్ షో సైంధవ్ ఈ నెల 13 న పాన్ ఇండియా లెవల్లో వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలకి సిద్దమవుతుంది. మొన్న రిలీజ్ అయిన సైంధవ్( saindhav) ట్రైలర్ అదిరిపోవడంతో మూవీ పై అందరిలో అంచనాలు కూడా పెరిగాయి. తాజాగా సోషల్ మీడియాలో మూవీ మీద వస్తున్న కొన్ని ట్రోల్ల్స్ కి ఆ చిత్ర దర్శకుడు చెక్ పెట్టాడు.
సైంధవ్ ట్రైలర్ లో వెంకటేష్ ఒక రౌడీని గన్ తో నోట్లో కాల్చే సీన్ ని చూపించారు. ఆ తర్వాత బుల్లెట్ ఆ రౌడీ బాటమ్ హోల్ నుంచి బయటకి వస్తుంది. ఇప్పుడు ఈ సన్నివేశం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ల్స్ చేస్తున్నారు. దీంతో దర్శకుడు శైలేష్ కొలను( sailesh kolanu)రంగంలోకి దిగి మా మూవీ మీద వస్తున్న ట్రోల్ల్స్ చాలా ఫన్నీ గా ఉన్నాయి. నాకు మొదటినుంచి వివరించడం ఇష్టం కాబట్టి నేను మీకు ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను అంటు బుల్లెట్ బాటమ్ హోల్ నుంచి ఎలా వస్తుందో వివరంగా చెప్పాడు. సాధారణంగా రివాల్వర్ తో నోటిలో కాల్చినట్లయితే బుల్లెట్ తల వెనుక నుండి నిష్క్రమిస్తుంది. కానీ మీరు ఒక వ్యక్తిని నిర్దిష్ట కోణంలో కూర్చోబెట్టి, తుపాకీ బారెల్‌ను తగినంతగా అతని బాడీ లోపలికి నెట్టివేస్తే నోరు మరియు బారెల్‌ను సుమారు 80 డిగ్రీలు ఉండేలా షూట్ చేస్తే అప్పుడు ఆ బుల్లెట్ శ్వాసనాళం ,అన్నవాహిక ల గుండా ఆపై కాలేయం, క్లోమం, గుండెను పంక్చర్ చేస్తుంది. ఆపై నేరుగా పెద్ద మరియు చిన్న ప్రేగులను సరళ రేఖలో చీల్చుతు పెద్దప్రేగులోకి ప్రవేశించి చివరకి శరీరం యొక్క దిగువ రంధ్రం ద్వారా నిష్క్రమిస్తుందని చెప్పాడు.

కాకపోతే అలా పర్ఫెక్ట్ గా కాల్చాలంటే ఎంతో నైపుణ్యం అవసరమని కాకపోతే నా సినిమాలో హీరో సైకో కాబట్టి ఆ నైపుణ్యాన్ని చాలా కష్టపడి నేర్చుకున్నాడని చెప్పటంతో పాటుగా సినిమాలో సిద్ధాంతపరంగా సాధ్యమయ్యే అన్ని మాస్ మూమెంట్ క్రియేట్ చేశా అని ట్విట్టర్ వేదికగా ట్రోలర్స్ కి తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు శైలేష్ చేసిన ఈ వ్యాఖ్యలకి వెంకటేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
![]() |
![]() |