![]() |
![]() |

సినీ నటుడు,‘మనం సైతం' ఫౌండేషన్ నిర్వహకులు కాదంబరి కిరణ్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావల శ్యామలకు ఆర్థిక సహాయం అందించారు. పావల శ్యామలకు అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్.. ఆమెకు రూ.25,000 చెక్కును అందించారు. పావల శ్యామలకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా సాయం చేశారు.
పావల శ్యామల పరిస్థితి గురించి మీడియా ద్వారా తెలుసుకున్న కాదంబరి కిరణ్ హైదరాబాద్ శివారులోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆమెను తనంతట తానే వెతుకుంటు వెళ్లి స్వయంగా సాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు. ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా సినీ పరిశ్రమలో పేద కార్మికులకు, అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడానికి ‘మనం సైతం'(Manam Saitham) అనే ఫౌండేషన్ స్థాపించి దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తున్నారు కాదంబరి కిరణ్.
![]() |
![]() |