![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'మున్నా'తో దర్శకుడిగా తొలి అడుగేశారు వంశీ పైడిపల్లి. ఆపై బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి చిత్రాలు చేశారు. ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. కట్ చేస్తే.. తన నెక్ట్స్ వెంచర్ ని కూడా ఓ అగ్ర కథానాయకుడితోనే ప్లాన్ చేస్తున్నారట వంశీ. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.
ఇటీవల వంశీ.. బన్నీని సంప్రదించి ఎమోషనల్ గా సాగే ఓ యాక్షన్ సబ్జెక్ట్ ని చెప్పారట. కథ నచ్చడంతో బన్నీ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అంతేకాదు.. ఇదో పాన్ ఇండియా మూవీలా ఉంటుందని వినిపిస్తోంది. త్వరలోనే బన్నీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీపై క్లారిటీ రావచ్చు. అన్నట్టు.. వంశీ డైరెక్ట్ చేసిన 'ఎవడు'లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించగా.. అల్లు అర్జున్ అతిథి పాత్రలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతం బన్నీ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో నటిస్తున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 13న రిలీజ్ కానుంది. ఆపై సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారు బన్నీ.
![]() |
![]() |