![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి అచ్చొచ్చిన సంగీత దర్శకుల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఒకరు. 'బావగారూ బాగున్నారా' నుంచి 'స్టాలిన్' వరకు వీరిద్దరి కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా మెప్పించింది. అలాంటి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో సుదీర్ఘ విరామం తరువాత 'ఆచార్య' చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2021 వేసవిలో విడుదల కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 'ఆచార్య' తరువాత చిరంజీవి నటించనున్న 'వేదాళమ్' రీమేక్ కి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ బాణీలు అందించబోతున్నాడు. చిరు, మహతి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మొత్తమ్మీద.. 'ఆచార్య', 'వేదాళమ్' రీమేక్.. ఇలా చిరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తండ్రీకొడుకులైన మణిశర్మ, మహతి స్వరసాగర్ కాంబినేషన్ లో రూపొందుతుండడం విశేషం. ఒకే ఏడాది (2021)లో రాబోతున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
![]() |
![]() |