![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోనే కొత్త కారు మెర్సిడెస్ మేబ్యాచ్ కారు రేటెంతో తెలుసా? అక్షరాలా 3 కోట్ల రూపాయలు! వాస్తవానికి... ఆ కారు ఎక్స్ షోరూం ధర ఒక కోటి 94 లక్షల రూపాయలు మాత్రమే. కంపెనీ తయారుచేసి ప్రజలకు ఇచ్చిన మోడల్ కాకుండా... తాను కోరుకున్న విధంగా కారును దీపిక కష్టమైజ్ చేయించుకున్నారు. అందుకని రేటు మరో కోటి రూపాయలు పెరిగింది.
నవంబర్ 5 గురువారం నాడు... ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీసు బయట కొత్త కారులో దీపికా కనిపించారు. మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇటీవల డ్రగ్స్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా రావడం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణకు హాజరు కావడం వంటి విషయాలు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందని మీడియాకి మొహం చాటేశారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది. దాని గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మెర్సిడెస్ మేబ్యాచ్ S500 మోడల్ కారును దీపిక కొన్నారు. గతంలో ఆమె భర్త వీరు సైతం ఈ కంపెనీకి చెందిన కారణం డ్రైవ్ చేస్తూ కనిపించారు.
![]() |
![]() |