![]() |
![]() |

'జ్యోతిలక్ష్మి'గా 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉర్రూతలూగించిన అందాల ఛార్మి.. అదే ఏడాది వచ్చిన 'మంత్ర 2' మూవీ తర్వాత అకస్మాత్తుగా నటన నుంచి తప్పుకొని నిర్మాతగా అవతారమెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి 'జ్యోతిలక్ష్మి' సినిమాకి ఆమె నిర్మాణ భాగస్వామి కూడా. సి. కల్యాణ్‌తో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతకుముందే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినా ఐటమ్ సాంగ్స్‌లో మెరుస్తూ వచ్చారు. 'ఢమరుకం', 'నాయక్', 'సరదాగా అమ్మాయితో', 'ఆర్.. రాజ్‌కుమార్' (హిందీ), '10 ఎన్నదుకుళ్ల' (తమిళం) సినిమాల్లో మెరుపులా మెరిసిందామె.
2016లో "పూరి కనెక్ట్స్ ఎల్ఎల్‌పి"ని పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో డైరెక్టర్‌గా తన పేరును కాకుండా తన తండ్రి ఉప్పల్ దీన్‌సింగ్ పేరు పెట్టారు. ఇవాళ పూరి కనెక్ట్స్ బాధ్యతలను ఆమె స్వయంగా చూసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'మెహబూబా', 'ఇస్మార్ట్ శంకర్' మూవీస్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ప్రొడ్యూసర్‌గా మారారు ఛార్మి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నాయి. ఒకటి ఆకాశ్ పూరి హీరోగా నటిస్తోన్న 'రొమాంటిక్' సినిమా కాగా, ఇంకొకటి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిల్మ్ 'ఫైటర్'. పూరి శిష్యుడు అనిల్ పాడూరి డైరెక్ట్ చేసిన 'రొమాంటిక్' ఇప్పటికే పూర్తయి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.
'ఫైటర్' మూవీ హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్‌తో కలిపి నిర్మిస్తున్నారు ఛార్మి. దీనికి పూరి డైరెక్టర్. క్రియేటివ్ వర్క్‌ను పూరి చేసుకుంటూ వెళ్తుంటే, ప్రొడక్షన్‌కు సంబంధించిన వ్యవహారాలను ఛార్మి చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఈ జోడీ టాలీవుడ్‌లో ఓ స్పెషల్ అట్రాక్షన్. నటి నుంచి నిర్మాతగా మారాలనుకొనేవాళ్లకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు ఛార్మి.
![]() |
![]() |