![]() |
![]() |

సునీల్, అనసూయ ప్రధాన పాత్రధారులుగా సలీమ్ మాలిక్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పిస్తోన్న ఈ మూవీని పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ సినిమా టీజర్‌ని సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి.
తాజాగా చిత్రంలోని రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘పాట చాలా బాగుంది. ఈ పాట చూస్తుంటే 'దర్జా' సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, ప్లేబాక్ సింగర్ మౌష్మి నేహా, రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.
కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌గారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అన్నారు.

సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సా ఖాన్, షమ్ము, అరుణ్ వర్మ (సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దర్శన్, సంగీతం: రాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ, కథ: నజీర్, మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: బందర్ బాబీ, స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ, పీఆర్ఓ: బి. వీరబాబు, కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి పైడిపాటి, నిర్మాత: శివశంకర్ పైడిపాటి, స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.
![]() |
![]() |