![]() |
![]() |
.webp)
దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన 'బీస్ట్' మూవీ ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్‌తో రిలీజవుతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. ఈమధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలను మరింతగా పెంచేసింది. తమిళంలో సన్ పిక్చర్స్ నిర్మించిన బీస్ట్‌ను అదే పేరుతో దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
సందర్భవశాత్తూ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఓ మూవీని ఇటీవలే దిల్ రాజు ప్రారంభించారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నిజానికి హీరోయిన్‌గా తమ ఫస్ట్ చాయిస్ పూజా హెగ్డేయేనని రివీల్ చేసి, ఆశ్చర్యపరిచారు దిల్ రాజు. 'బీస్ట్' మూవీ ప్రమోషనల్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ నిజాన్ని బయటపెట్టారు.
వరుస హిట్లతో పూజ లక్కీ గాళ్‌గా పేరు తెచ్చుకుందనీ, టాప్ హీరోలు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించిందనీ చెప్పారు. అందుకే తాము విజయ్‌తో నిర్మించే ద్విభాషా చిత్రానికి మొదట పూజనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుని, ఆమెతో చర్చలు కూడా జరిపామనీ రాజు వెల్లడించారు. అయితే 'బీస్ట్'లో ఆమే హీరోయిన్ అవడం, వెంటవెంటనే కాంబినేషన్ రిపీట్ చేయడం బాగుండదనే ఉద్దేశంతోనూ, ఆమె డేట్స్ కూడా అడ్జస్ట్ అయ్యేలా లేకపోవడంతోనూ ఆమెను కాదనుకొని, రష్మికను తీసుకున్నామని ఆయన చెప్పారు.
![]() |
![]() |