![]() |
![]() |

'అత్తారింటికి దారేది' మూవీలో పవన్ కల్యాణ్‌తో బాపుగారి బొమ్మ అని పిలిపించుకున్న నటి ప్రణీత త్వరలో తల్లి కాబోతోంది. తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన కొన్ని ఫొటోల ద్వారా అనౌన్స్ చేసింది ప్రణీత. ఏప్రిల్ 11 ఆమె భర్త నితిన్ రాజ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిందామె. అందులో పాజిటివ్ అని చూపిస్తోన్న ప్రెగ్నెన్సీ టెస్ట్‌తో పాటు, తన కడుపు స్కానింగ్ ఫొటోలను కూడా ఆమె చూపించింది.
ఆ ఫొటోలను షేర్ చేసిన ప్రణీత.. "For my husband’s 34th bday , the angels above have a present for us" అంటూ రాసుకొచ్చింది. గత ఏడాది మే 31న వ్యాపారవేత్త నితిన్ రాజును బెంగళూరులో పెళ్లాడింది ప్రణీత. మొదట స్నేహితులుగా జర్నీని కొనసాగించిన ఆ ఇద్దరూ కరోనా టైమ్‌లో కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని జీవిత భాగస్వాములుగా మారారు.

గత ఏడాదే 'హంగామా 2' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రణీత, ఆ వెంటనే అజయ్ దేవ్‌గణ్ సరసన 'భుజ్' మూవీలో నటించింది. ప్రస్తుతం కన్నడంలో 'రమణ అవతార' అనే సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమకోసమే లాంటి సినిమాల్లో నటించింది ప్రణీత.

![]() |
![]() |