![]() |
![]() |

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఆదుర్తి సుబ్బారావు ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు విజయపథంలో పయనించాయి. వాటిలో `మంచి మనసులు` ఒకటి. తమిళ చిత్రం `కుముదం` (1961) (ఆదుర్తి నే దర్శకుడు) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఏయన్నార్ కి జంటగా సావిత్రి, షావుకారు జానకి నటించగా ఎస్వీ రంగారావు, గుమ్మడి, రమణా రెడ్డి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, వాసంతి, పొట్టి ప్రసాద్, వంగర, చిడతల అప్పారావు ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
కేవీ మహదేవన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ, శ్రీ శ్రీ, దాశరథి, ఆరుద్ర, కొసరాజు సాహిత్యమందించారు. ``నన్ను వదిలి పోలేవులే``, ``మావ మావ``, ``శిలలపై శిల్పాలు చెక్కినారు``, ``ఏవండోయ్ శ్రీవారు``, ``ఎంత టక్కరి వాడు``, ``త్యాగము ఇదియేనా``, ``ఓహో ఓహో పావురమా``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. బాబూ మూవీస్ పతాకంపై సి. సుందరం నిర్మించిన `మంచి మనసులు`.. 1962 ఏప్రిల్ 11న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |