![]() |
![]() |

తెలుగునాట వాల్మీకి `రామాయణం` ఆధారంగా పలు చిత్రాలు తెరకెక్కాయి. అయితే, అంతా బాల నటులతోనే రూపొందిన సినిమాగా దర్శకుడు గుణశేఖర్ తీర్చిదిద్దిన `రామాయణం` (1997)కి ప్రత్యేక స్థానం ఉంది. 3,000 మందికి పైగా బాలనటులతో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించగా.. సీతగా స్మితా మాధవ్ అలరించింది. రావణుడిగా స్వాతి కుమార్, లక్ష్మణుడిగా నారాయణమ్ నిఖిల్, ఆంజనేయగా అరుణ్ గంగాధర్, దశరథగా ఆదిత్య వర్మ, భరతగా చిరంజీవి, కౌసల్యగా మనీషా చూడామణి, కైకేయిగా వసుంధర, సుమిత్రగా సుమ, ఊర్మిళగా శ్వేతా రావు, శబరిగా సునయన తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రానికి మాధవపెద్ది సురేశ్ బాణీలు కట్టగా.. ఎల్. వైద్యనాథన్ నేపథ్య సంగీతం అందించారు. ఇందులోని పాటలు, పద్యాలు, శ్లోకాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. శబ్దాలయ థియేటర్స్ పతాకంపై ఎమ్మెస్ రెడ్డి నిర్మించిన `రామాయణం`.. `ఉత్తమ బాలల చిత్రం` విభాగంలో `జాతీయ` పురస్కారం అందుకుంది. అలాగే `ఉత్తమ బాలల చిత్రం`, `ఉత్తమ బాల నటి` (స్వాతి కుమార్) విభాగాల్లో `నంది` అవార్డులను సొంతం చేసుకుంది. 1997 ఏప్రిల్ 11న విడుదలై విజయం సాధించిన `రామాయాణం`.. నేటితో పాతికేళ్ళు పూర్తిచేసుకుంది. అంటే.. పూర్తి స్థాయి పాత్రలో తారక్ తొలిసారిగా వెండితెరపై దర్శనమిచ్చి 25 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |