![]() |
![]() |

బాలీవుడ్ యాక్టర్ దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు మానసిక అశాంతి కలగడానికి బాధ్యత కొంతమంది ఇండస్ట్రీ పెద్దలేనంటూ ఫైర్‌బ్రాండ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఆరోపించడం సంచలనం కలిగించింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్ణబ్ గోస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అలియా భట్‌ను పాయింట్ ఔట్ చేసింది. సుశాంత్ ఎవరని ప్రశ్నించడం ద్వారా సుశాంత్‌ను ఆమె అవమానించిన 'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్‌ను ఆమె ఎత్తి చూపింది. 'గల్లీ బాయ్' మూవీలో 10 నిమిషాల సేపు కనిపించే చిన్న పాత్ర చేసినందుకే అలియా బెస్ట్ యాక్ట్రెస్ ట్రోఫీ అందుకుందని, అందుకే వాటిని తాను ఆశ్రిత పక్షపాత అవార్డ్ షోలంటాననీ కంగన విమర్శించింది. 'మణికర్ణిక' మూవీలో రాణీ లక్ష్మీబాయ్‌గా తాను ప్రదర్శించిన అభినయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ప్రశ్నించింది. 'గల్లీ బాయ్' కంటే నితీష్ తివారి డైరెక్ట్ చేయగా సుశాంత్‌సింగ్ నటించిన' చిచ్చోరే' సినిమాకు విమర్శకుల ప్రశంసలు అధికంగా లభించినా, దానికి అవార్డులు ఇవ్వలేదనీ ఆమె తూర్పారబట్టింది.
కంగన ఆరోపణలు, విమర్శలకు అలియా భట్ స్పందించింది. ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో, "ఎవరూ నమ్మకపోయినా నిజం నిజమే. అందరూ నమ్మినా అబద్ధం అబద్ధమే" అనే కొటేషన్‌ను పోస్ట్ చేసింది. సుశాంత్‌సింగ్ దురదృష్టకర మరణం తర్వాత అలియా భట్, ఆమె తండ్రి మహేశ్‌భట్‌ను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పోటెత్తుతూ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం "మీరు అనుకున్నదాని కన్నా సైలెన్స్ చాలా ఎక్కువే చెబుతుంది" అనే కొటేషన్‌ను అలియా షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆమె రాజమౌళి సినిమా 'ఆర్ ఆర్ ఆర్'లో రామ్‌చరణ్ జోడీగా నటిస్తోంది.
![]() |
![]() |