![]() |
![]() |

షూటింగ్‌లు లేకపోవడంతో నాలుగు నెలలుగా కుటుంబంతో, ప్రత్యేకించి తన పిల్లలతో హాయిగా గడుపుతూ రోజుల్ని ఆస్వాదిస్తున్నాడు సూపర్‌స్టార్ మహేశ్. సోషల్ మీడియాలో ఆయన కానీ, ఆయన శ్రీమతి నమ్రత కానీ షేర్ చేస్తున్న వీడియోలు, ఫొటోల ద్వారా పిల్లల్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతోంది. అయితే కూతురు సితార అంటే మహేశ్‌కు ఒకింత ప్రేమ ఎక్కువ అనిపిస్తుంటుంది.
సోమవారం సితార బర్త్‌డే. ఈ సందర్భంగా అందరు తండ్రుల్లాగే తన కూతురికి అందరికంటే ముందు శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్. సితారతో తను గడిపిన బెస్ట్ మూమెంట్స్‌ను ఒక వీడియో కంపైలేషన్‌తో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటు “So fast so 8. I love you like you will never know. Wishing you a very happy birthday. #SituPapaTurns8,” అని రాసుకొచ్చాడు. తల్లి నమ్రత, అన్న గౌతమ్ కూడా సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలను షేర్ చేశారు. మహేశ్ షేర్ చేసిన వీడియో మాత్రం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

![]() |
![]() |