![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు మణిరత్నం వైఫ్, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని రీసెంట్‌గా ఒక షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేశారు. జస్ట్... 20 మినిట్స్ లెంగ్త్ ఉన్న ఆ షార్ట్ ఫిలింని లాక్‌డౌన్‌లో తీశారు. దీనికి మరో స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో కమల్ హాసన్ పెద్ద కుమార్తె శ్రుతి హాసన్ యాక్ట్ చేశారు. అయితే, ఆమెది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. జస్ట్... గెస్ట్ అప్పియరెన్స్. హాఫ్ డేలో షూటింగ్ కంప్లీట్ చేసింది.
సుహాసిని తీసిన ఆ షార్ట్ ఫిలిం 'చిన్నన్‌చిరు కిళియే' త్వరలో రిలీజ్ కానుంది. సుహాసిని అడిగిన వెంటనే శ్రుతి హాసన్ కాదని చెప్పకుండా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే... వాళ్ళిద్దరూ కజిన్స్ కదా! అందుకని... మేకప్ మేన్, హెయిర్ డ్రస్సర్ లేకపోయినా అన్నీ స్వయంగా చేసుకుని యాక్ట్ చేశారట. అదీ సంగతి. శ్రుతి హాసన్ రోల్, షార్ట్ ఫిలిం ఎలా ఉంటాయో మరి!
తెలుగులో రవితేజకు జంటగా 'క్రాక్'లో నటిస్తున్న శ్రుతి హాసన్... పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో హీరో భార్యగా కీలకమైన అతిథి పాత్రలో నటించనున్నది. మొదట పవన్ సినిమా చేయడం లేదని చెప్పిన శ్రుతి, తరవాత చేస్తున్నానని కన్ఫర్మ్ చేసింది. అయితే, పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని చెప్పింది.
![]() |
![]() |