![]() |
![]() |
.jpg)
అక్కినేని కుటుంబం ఎప్పటికి మరువలేని మధురమైన సినిమా అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్. 'మనం' తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని వంశవృక్షం నాటిన అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రమే కాదు... అక్కినేనితో ఆయన కుమారుడు నాగార్జున, మనవళ్లు నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా. అటువంటి 'మనం' తీసిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. దీని తరవాత విక్రమ్ కె. కుమార్ సినిమా ఉంటుందని టాక్. బీవీఎస్ రవి అందించిన కథతో తెరకెక్కనున్న ఆ సినిమాకు 'థాంక్యూ' టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. కామెడీ, డ్రామా, కొంచెం యాక్షన్, రొమాన్స్ సహా మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందట. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని దర్శకుడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
![]() |
![]() |