![]() |
![]() |

ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీని రెండు మ్యూజిక్ లేబుల్స్ శాసిస్తున్నాయనీ... ఇదే ధోరణి కొనసాగితే సంగీత దర్శకులు, గాయనీ గాయకులలో కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరహా ఆత్మహత్యలు మొదలవుతాయని ఫేమస్ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరో గాయకుడు అద్నాన్ సమీ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యూజిక్ మాఫియా మీద మండిపడ్డాడు.
“ఇండియన్ ఫిల్మ్ & మ్యూజిక్ ఇండస్ట్రీలో కచ్చితంగా కఠినమైన మార్పు రావలసిన అవసరం ఉంది. సంగీత పరంగా.... కొత్త గాయకులతో సహా అనుభవజ్ఞులైన గాయకులు, స్వరకర్తలు & సంగీత దర్శకులు దోపిడీకి గురవుతున్నారు. క్రియేటివిటీ గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు, క్రియేటివిటీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని అద్నాన్ సమీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాత పాటలను రీమిక్స్, రీమేక్ చేయడం మీద కూడా అద్నాన్ మండిపడ్డారు. రీమేక్, రీమిక్స్ బదులు కొత్త గాయనీ గాయకులకు అవకాశాలు ఇస్తే బాగుంటుందని ఆయన సూచించారు. మ్యూజిక్ మాఫియా తమను తాము దేవుళ్లుగా భావిస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు చేసిన దాంతో సరిపెట్టామని, మార్పుకు నాంది పలకమని అద్నాన్ సమీ హెచ్చరించారు.
![]() |
![]() |