![]() |
![]() |

మోడల్, ఫ్యాషన్ డిజైనర్, మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అక్కినేని అభిమానులు, అందునా సమంత ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. కారణం.. మూడు రోజుల క్రిత శిల్పారెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసిన ఒక సెల్ఫీ ఫొటో. అందులో శిల్పను గట్టిగా కౌగలించుకొని ఆమె బుగ్గపై సమంత ముద్దు పెట్టుకుంటోంది. ఆ ఫొటో షేర్ చేసిన రెండు రోజులకే తనకు కోవిడ్ 19 సోకినట్లు స్వయంగా శిల్పారెడ్డి తెలియజేసింది. దీంతో ఆమె ఫాలోయర్స్ షాకయ్యారు. అంతకంటే ఎక్కువగా సమంత ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
శిల్పారెడ్డి షేర్ చేసిన ఫొటో ఎప్పటిది, ఆమెకు కోవిడ్ 19 సోకిన తర్వాతే ఆ ఇద్దరూ కలిశారా, లేక ఆ ఫొటో పాతదా?.. అని ఆరా తీస్తున్నారు. కరోనా టైమ్‌లో అందరూ సోషల్ డిస్టాన్సింగ్ పాటించాలంటూ సమంత సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సూచిస్తూ వస్తోంది. అట్లాంటిది ఎంత క్లోజ్ ఫ్రెండైనా ఈ సంక్షోభ సమయంలో అలా హగ్ చేసుకొని ముద్దు పెడతారా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీకి శిల్పారెడ్డి ఫ్యామిలీ బాగా సన్నిహితం. దాంతో సమంత కూడా శిల్పకు మంచి ఫ్రెండయ్యింది. ఈ నేపథ్యంలో శిల్పకు, ఆమె భర్తకూ కరోనా పాజిటివ్ అని తేలింది. మరి సమంత కూడా కరోనా టెస్ట్ చేయించుకుందా, లేదా అనే విషయం తెలియరాలేదు. ఒకవేళ శిల్పకు కరోనా వైరస్ సోకిన తర్వాతే ఆ ఇద్దరూ కలుసుకుని ఉంటే మాత్రం.. నాగచైతన్య సహా అక్కినేని ఫ్యామిలీ అంతా కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాల్సిందే. దీనిపై సమంత ఇంతదాకా స్పందించలేదు.
![]() |
![]() |