![]() |
![]() |

హీరోయిన్ నందిని రాయ్ అంటే గుర్తు పెట్టడం కష్టమేమో!? హీరోయిన్గా సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఈ అందాల బొమ్మ ఖాతాలో పడలేదు. నాని హోస్ట్‌గా చేసిన 'బిగ్ బాస్ 2'లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నందిని రాయ్ అంటే ఠక్కున గుర్తు పడతారు. ఒకానొక సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందట. హీరోయిన్గా సరైన సక్సెస్ లేక డిప్రెషన్లోకి వెళ్లాలని నందిని రాయ్ తెలిపింది.
నందిని రాయ్ కెరీర్ 2011లో మొదలైంది. మొదట్లో చేసిన సినిమాలు సరిగా ఆడలేదు. తెలుగులో నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠ తీసిన 'మాయ' చేసింది. అది ప్లాప్. తర్వాత సుధీర్ బాబు సరసన 'మోసగాళ్లకు మోసగాడు' చేసింది. అది ప్లాప్. అప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకుందట.
"నా కెరీర్ బాగుంటుందని అనుకున్నా. తొలినాళ్ళలో మంచి అవకాశాలు వచ్చాయి. అయితే, కొన్ని క్యాన్సిల్ అయితే... చేసిన సినిమాలు వర్కవుట్ కాలేదు. తరవాత 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాపై ఆశలు పెట్టుకున్నాను. అదీ ఆడలేదు. దాంతో డిప్రెషన్లోకి వెళ్లాను. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేది. టెర్రస్ మీదకు వెళ్లి కిందకు దూకాలని, మణికట్టు దగ్గర కోసుకోవాలని వంటి ఆలోచనలు వచ్చేవి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను" అని నందిని రాయ్ తెలిపింది.
సైక్రియాటిస్టు దగ్గరకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడంతో, కొన్ని కౌన్సెలింగులు తరవాత ఆత్మహత్య ఆలోచనల నుండి బయటపడ్డానని నందిని రాయ్ తెలిపింది. సుశాంత్ సూసైడ్ తరవాత డిప్రెషన్, సూసైడ్ ఆలోచనల నుండి బయటపడిన సెలబ్రిటీలు తమ అనుభవాలు చెబుతున్నారు.
![]() |
![]() |