![]() |
![]() |

కొంత కాలంగా ఆమిర్ ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఏ సినిమాల్లోనూ కనిపించడం లేదు. అతను ఏం చేస్తున్నాడంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ వస్తున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలతో అతను ఇబ్బందులు పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఇమ్రాన్ నటనకు గుడ్ బై చెప్పేశాడని అతని క్లోజ్ ఫ్రెండ్, యాక్టర్ అక్షయ్ ఓబరాయ్ వెల్లడించడం సంచలనం సృష్టించింది.
నవభారత్ టైమ్స్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ బాంబు పేల్చాడు. 18 సంవత్సరాలుగా తాము ఫ్రెండ్స్ అనీ, ఇద్దరం కిశోర్ యాక్టింగ్ స్కూల్‌లో కలిసి శిక్షణ పొందామనీ అతను చెప్పాడు. ఇమ్రాన్ నటనకు స్వస్తి చెప్పాడని తెలిపిన అక్షయ్, అతనిలో మంచి డైరెక్టర్, రైటర్ ఉన్నాడని చెప్పాడు.
"బాలీవుడ్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్. ఇక నుంచీ అతను యాక్టర్ కాదు, ఎందుకంటే అతను నటనకు స్వస్తి చెప్పాడు. ప్రస్తుతానికైతే అతను నటనను వదిలేశాడు. నాకు తెలిసినంత వరకు, అతనిలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నాడు. అతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడో నాకు తెలీదు. అతనిపై నేనెలాంటి ఒత్తిడి పెట్టను. కానీ ఓ ఫ్రెండ్‌గా, త్వరలోనే అతను తన చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని భావిస్తున్నా. ఇమ్రాన్ డైరెక్ట్ చేసినప్పుడు, ఒక వండర్‌ఫుల్ ఫిల్మ్ తీస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే సినిమా పట్ల అతనికున్న సున్నితత్వం కానీ, అవగాహన కానీ చాలా ఎక్కువ" అని చెప్పాడు అక్షయ్.
ఆమిర్ ఖాన్ సినిమాలు 'ఖయామత్ సే ఖయామత్ తక్', 'జో జీతా వోహి సికిందర్' లాంటి వాటిలో బాల నటుడిగా కనిపించిన ఇమ్రాన్, హిట్ మూవీ 'జానే తు యా నేనా నా (2008)తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'ఐ హేట్ లవ్ స్టోరీస్' (2010), 'ఢిల్లీ బెల్లీ' (2011), 'మేరే బ్రదర్ కీ దుల్హన్' (2011) లాంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
![]() |
![]() |