![]() |
![]() |

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ ఫిలిం 'దొరసాని'తో హిట్ అందుకోవడంలో వెనుకబడ్డాడు. ఇప్పుడు 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మరోసారి
ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే వారసులకు ఇంట్లో పెద్దలు సలహాలు, సూచనలు ఇవ్వడం సహజమే. పిల్లల కోసం కథలు కూడా వింటారు. అయితే, తమ్ముడు చేయబోయే సినిమా కథలను విజయ్ దేవరకొండ వినడం లేదు. ఈ విషయాన్ని ఆనంద్ చెప్పాడు.
"ఇప్పటివరకు నా కథలు ఏవీ అన్నయ్య వినలేదు. నేను విని ఓ నిర్ణయం తీసుకుంటున్నాను. అయితే, అన్నయ్య అండ లేదని అనడం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడిని కాబట్టే నా దగ్గరకు దర్శకులు,
నిర్మాతలు వస్తున్నారు కదా! అలాగని, మొత్తం అన్నయ్య మీద ఆధారపడితే సొంతంగా నేను ఎదగలేను కదా! సినిమా పూర్తయ్యాక అన్నయ్యకు చూపిస్తా. సలహాలు, సూచనలు స్వీకరిస్తా" అని ఆనంద్ దేవరకొండ చెప్పాడు. మొత్తానికి మంచి నిర్ణయమే తీసుకున్నాడు.
![]() |
![]() |