![]() |
![]() |

చట్టం ముందు సామాన్యులైనా ఒకటే, సెలబ్రిటీలైనా ఒకటే. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వారూ జరిమానాలు కట్టక తప్పదు. హీరోయిన్ తాప్సీ కూడా అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనకు గాను జరిమానా చెల్లించింది. బుధవారం ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ పిక్చర్‌ను షేర్ చేసింది. అందులో హెల్మెట్ లేకుండా ఆమె ఓ బైక్ నడుపుతోంది. హెల్మెట్ ధరించనందుకు ఫైన్ వేసే ముందు ఆ ఫొటో తీసినట్లు ఆమె తెలిపింది.
అయితే ఆ ఫొటోలో తాప్సీ ముఖం మనకు కనిపించడం లేదు. ఎందుకంటే అది వెనుక నుంచి తీసింది కాబట్టి. ఆ బైక్ నడుపుతోంది తాప్సీ అని మనకు తెలియజేస్తోంది.. కేవలం ఆమె ఉంగరాల జుట్టే. జీన్స్‌పై డెనిమ్ జాకెట్ ధరించి ఆ బైక్ నడుపుతోంది తాప్సీ. 'రష్మి రాకెట్' షూటింగ్లో ఉన్నప్పుడు ఆ పిక్చర్ తీసినట్లు ఆమె వెల్లడించింది. ఆ పిక్చర్‌ను షేర్ చేస్తూ, "Just before I was fined for no helmet" అని రాసింది తాప్సీ.
.jpg)
ఆ పిక్చర్ షేర్ చేసిన నాలుగు గంటల వ్యవధిలో 2.5 లక్షలకు పైగా దానికి లైక్స్ రావడం గమనార్హం. 'రష్మి రాకెట్'ను ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేస్తున్నాడు.
.jpg)
![]() |
![]() |